రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడు కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. శివ వచ్చి పాతికేళ్లు అయినా ఇంకా దాని గురించి ఇప్పటి మాట్లాడుకుంటుంటారు. దీంతో అటు బాలీవుడ్ కు వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్లు తీసి దేశం మొత్తం తన వైపు చూసే చేసాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు వర్మ తీసిన చిత్రాలన్నీ కల్ట్ క్లాసిక్‌గానే మిగిలాయి.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆరిపోతున్న అగ్నికి ఆజ్యం పోసినట్టు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడు. మా చిరంజీవినే అంటావా.. నిన్ను క్షమించేది లేదంటూ గరికపాటిని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా ట్వీట్లు వదులుతున్నాడు.
బుధవారం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా ఉన్నాయి.గరికపాటి నరసింహారావు గతంలో తన ప్రవచనాల్లో ఆడవాళ్ల వేషధారణ, వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. అత్యాచారాలకు గురికావడంలో మహిళలదే బాధ్యత అని గడ్డిపాటి చెబుతున్నారు.
ఆత్మగౌరవం కలిగిన మహిళలందరూ ఇతడిని బొందపెట్టాలి అని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా హిందుత్వం పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్న గరికపాటి నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
