Rice : మానవుని జీవితంలో తీసుకునే ఆహార పదార్థాలలో ముఖ్యమైన భూమిక పోషించేది అన్నం. అన్నం ఒకపూట తినకపోతే శరీరం నీరసంగా తయారైపోతుంది. అలాంటి అన్నాన్ని ఒక నెల రోజులపాటు తినకుండా ఉంటే మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అన్నం కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ అధికంగా ఉండే పోషకాలు లేని ఆహారం.
బియ్యాన్ని అధికంగా పాలిష్ చేస్తారు. అలాంటి బియ్యాన్ని మనం అన్నం లాగా వండుకొని తినడం వల్ల, మన ఒంటిలో చక్కెరస్థాయి పెరిగి బరువు పెరగడానికి దారి తీస్తుంది. మరి అలాంటప్పుడు అన్నం ఏ రకంగా తినవచ్చు.. మన రోజువారి ఆహారంలో అన్నం ఎలా స్కిప్ చేయాలి. ఒక నెలపాటు అన్నం తినకపోతే ఆ ప్రభావం మన శరీరం మీద ఎలా ఉంటుంది.. ఇప్పుడు తెలుసుకుందాం.ఒక నెలపాటు అన్నం మానేయడం వల్ల మీ శరీరంలో ఉండే
క్యాలరీలు తగ్గి మీ శరీర బరువు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే కార్బోహైడేట్ల పరిమాణం అధికం. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. కాబట్టి ఈ చక్కెర స్థాయి తగ్గాలి అని అంటే ఒక నెలపాటు అన్నం పూర్తిగా వదిలివేయాలి. దానివల్ల అధిక బరువు సమస్య తగ్గడమే కాక చక్కెరవ్యాధి దరిచేరకుండా ఉంటుంది. పూర్తిగా బియ్యం వినియోగాన్ని ఆపివేయడం వల్ల మీ రక్తంలో చక్కెరస్థాయి తగ్గుతుంది.
ఇది వాస్తవం. కానీ ఒకేసారి అన్నం మానేయడం వల్ల మీ శరీరాన్ని నీరసం ఆవహిస్తుంది. మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్నం తినకుండా ఉండడం వల్ల మీ శరీరంలో ఖనిజాలు విటమిన్లు లోపించే ప్రమాదం ఉంది. కాబట్టి రోజువారి డైట్ లో కాస్తయినా అన్నం ఉండేలా చూసుకోవాలి. పూర్తిగా మానేయాలి అనుకునేవారు మాత్రం ఒక్కోరోజు అన్నం తీసుకునే స్థాయిని తగ్గిస్తూ రావాలి. అలా కొన్ని రోజులకు అన్నం పూర్తిగా మానేయడానికి మీకు వీలు కలుగుతుంది.