Rohit Sharma : అలవోకగా సిక్స్‌లు కొట్టేయగల సమర్థుడు. ప్రపంచ కప్ అంటే గాడ్ మోడ్‌లోకి మారిపోతాడు. పెద్ద టోర్నీకి తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా, ఆ ఒత్తిడి చాయలను కనిపించనివ్వ లేదు. ఒక్క మ్యాచ్‌తో ఎన్నో రికార్డులను తన ఖాతాలో జమచేసుకొన్నాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. దాదాపు 40 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును చెరిపేశాడు.
ఇప్పటికే సచిన్, క్రిస్ గేల్ రికార్డులను కూడా అధిగమించాడు. కీలక సమయంలో అద్భుత ఫామ్‌ను అందిపుచ్చుకోవడం భారత జట్టు కి శుభసూచికం. ఆడేది మూడో వరల్డ్ కప్ అయినా ఏడు సెంచరీలను నమోదు చేశాడు. 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఏడు శతకాలు బాదడం చూస్తేనే.. అతడి విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో తెలుస్తోంది. ఇందులో మూడు సెంచరీలు లక్ష్యఛేదన సమయంలోనే కావడం విశేషం. రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నీలలో ఏకంగా ఏడు సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ సాధించిన ఏడు సెంచరీలు

1.మొదటిసారి 2015 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 137 పరుగులు చేసి వరల్డ్ కప్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు రోహిత్ శర్మ.
2.ఇక 2019 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 122 పరుగులు చేసి సెంచరీ తో విధ్వంసాన్ని మొదలుపెట్టిన రోహిత్..
3.ఇదే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై 140,
4.ఇంగ్లాండ్ పై 102,
5.బంగ్లాదేశ్ పై 102,
6 . శ్రీలంక పై (103) సెంచరీలు చేసి ఒకే వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలతో కదం తొక్కాడు.
7.2023 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 131 పరుగులు చేసి సెంచరీతో అరుదైన రికార్డు సృష్టించాడు.
వన్డే ప్రపంచకప్ లో వేగవంతంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ కూడా 19 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్ లో వేగవంతంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ కూడా 19 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 20 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. భారత్ తరఫున వన్డే ప్రపంచకప్ లో వేగవంతంగా వేయి పరుగులు చేసిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్ (వన్డే, టి20, టెస్టు)లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా ఉన్న విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. అతడు 551 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 553 సిక్సర్లు బాదాడు. అఫ్గానిస్తాన్ తో జరిగిన పోరులో 4 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 472 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 555 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ లలో రోహిత్ కు ఇది 7వ సెంచరీ. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 6 సెంచరీల రికార్డు కనుమరుగైంది.
