RRR Won Oscar:RRR కి ఆస్కార్ రావడం పట్ల… అల్లు అర్జున్ హార్ట్ టచింగ్ ట్వీట్
RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ కొల్లగొట్టిన వేల ప్రముఖుల ప్రశంసలతో జక్కన్న టీం ఉబ్బితబ్బిబ్బు అవుతోంది.. దేశం నలుమూలల నుండి అభినందనలు వెళువెత్తుతున్నాయి. ప్రధాని తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుlu కూడా రాజమౌళి బృందానికి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే..

తాజాగా RRR కి ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ప్రత్యేక ట్వీట్ చేశారు.
ఆస్కార్ వేదికపై తెలుగు నాటు నాటు పాటు సత్తా చూసి మనసు ఉప్పొంగిపోయిందని తెలిపారు.ఇది యావత్ భారత్ దేశానికి గొప్ప గర్వ కారణం అని అన్నారు.కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.అలాగే తమ డాన్స్ తో ప్రపంచాన్ని డాన్స్ చేయించిన లవ్లీ బ్రదర్స్ ఎన్టీయార్, రామ్ చరణ్ కి శుభాకాంక్షలు అని తెలిపారు.ఆస్కార్ వెనుక దర్శకుడు రాజమౌళి కృషి ఎంతో ఉందని,భారత సినిమాకి ఇది హార్ట్ టచింగ్ మూమెంట్” అని ట్వీట్ చేశారు
