రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న మోహన్ భగవత్, ఇవాళ పొద్దున్నే హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడ చేరుకున్నారు.
బెజవాడ దుర్గమ్మ దర్శనార్థం ఇవాళ పొద్దున్నే విజయవాడ దర్గమ్మ సన్నిధి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న మోహన్ భగవత్ కి ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకి ఆలయ వేదపండితులు ఆశీర్వాదాలు అందించారు. అలాగే మోహన్ భగవత్ కి ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం మరియూ పట్టు వస్త్రాలు బహుకరించారు.
అక్కడి నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గాన గుంటూరు జిల్లా నూతక్కి చేరుకున్నారు. అక్కడ ఆయన ఏపి పర్యటనలో భాగంగా “ప్రచారక్ బైఠక్” లో పాల్గొననున్నారు.