Sambarala Yeti Gattu: సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ రిలీజ్
Sambarala Yeti Gattu: ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ విజయంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చిన టాలీవుడ్ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. నేడు సాయి దుర్గా తేజ్ సందర్భంగా, ఈ శక్తిమంతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి ‘అసుర ఆగమన’ పేరుతో మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసి మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ గ్లింప్స్‌లో సాయి తేజ్ మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన, కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకునే లుక్‌లో దర్శనమిచ్చారు.
రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. బానిసల్లా బతుకుతున్న కొందరి మధ్య, బాంబులు చుట్టుకుని తిరిగే రాక్షసులు, వారికి అండగా నిలిచే ఒక నాయకుడు—ఇదే ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.
“ఒక మనిషి, ఒక భూమి, వాటిని బలంగా బంధించే రక్త బంధం” అనే క్యాప్షన్, “అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం” అంటూ సాయి దుర్గా తేజ్ చెప్పే పవర్-ఫుల్ డైలాగ్.. ఈ సినిమా భూమి కోసం, అందులో లభించే ఖనిజాల కోసం జరిగే భీకర పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు, మైథలాజికల్ టచ్, మాస్, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కినట్లు గ్లింప్స్‌ను చూస్తే స్పష్టమవుతోంది. చీకటిని చీల్చి వెలుగు నింపే పోరాటానికి సిద్ధమవుతున్న యోధుడిలా సాయి తేజ్ ‘బాల’ పాత్రలో కనిపిస్తున్నారు.
రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రైమ్ షో ఎంటర్‌టైనమెంట్ పతాకంపై కె. నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. CG వర్క్స్ ఆలస్యం కారణంగా వాయిదా పడిన ఈ పవర్ ఫుల్ మూవీ త్వరలోనే పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది.
