Samantha: రాజ్ నిడుమోరుతో మరింత క్లోజ్‌గా సమంత.. కొత్త ఫోటోతో పెరిగిన అనుమానాలు
Samantha: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ఈ మధ్యకాలంలో సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడుమోరుతో ఉన్న సాన్నిహిత్యం గురించి వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లతో వివాహం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఈ రిలేషన్‌షిప్ వార్తలను సమంత కానీ, రాజ్ నిడుమోరు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఖండించలేదు. దీనికి తోడు, సమంత తరచుగా రాజ్ నిడుమోరుతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నారు. రాజ్, డీకే ద్వయంలో ఒకరు కాగా, ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ ప్రాజెక్ట్‌లో వారితో కలిసి పనిచేస్తున్నారు.
తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో రాజ్ నిడుమోరును హగ్ చేసుకుని ఉన్న ఒక ఫోటోను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు, సినీ వర్గాలు త్వరలోనే వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారా? లేదా పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఫోటోతో పాటు సమంత పంచుకున్న పోస్ట్‌లో, “నేను స్నేహితులు, కుటుంబ సభ్యులతో చుట్టుముట్టబడి ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని నమ్మడం మరియు ముందుకు సాగుతున్నప్పుడు నేర్చుకోవడం. ఈ రోజు, నేను నా చిన్న విజయాలను జరుపుకుంటున్నాను. నేను కలిసిన అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే మరియు అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం నాకు చాలా కృతజ్ఞతగా ఉంది,” అని పేర్కొన్నారు.
అంతేకాక “చాలా నమ్మకంతో, ఇది ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు,” అంటూ తన పోస్ట్‌ను ముగించారు. ఈ పోస్ట్ మొత్తాన్ని పరిశీలిస్తే, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలను, వదంతులను ఏ మాత్రం పట్టించుకోకుండా, తనకు నచ్చిన విధంగా, ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని సమంత పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతోంది. ‘డోంట్ కేర్’ అన్నట్టుగా తన జీవితాన్ని తాను డిజైన్ చేసుకుంటూ పోతున్న సమంత ధైర్యాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు.
