Samantha: స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకు మించి ఫాలోయింగ్ సామ్ సొంతం. ఇటీవల హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మరికొన్ని రోజుల్లో ఖుషితో అలరించనుంది. ఇదిలావుండగా తాజాగా IMDb 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్
తారలను ప్రకటించగా అందులో సమంత మొదటి స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను కూడా వెనక్కి నెట్టి సమంత అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఇదే జాబితా గతంలో రిలీజ్ చేయగా తొమ్మిదో స్థానంలో నిలిచింది సమంత. ఇక బుట్టబొమ్మ పూజ హెగ్డే 17వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలు, వెబ్ సిరీసులకు వచ్చిన ఆదరణను బట్టి ఈ ఇండియన్ మూవీ డేటాబేస్ (IMDB) రేటింగ్స్ ఇస్తారు.
ఇందులో సామ్ టాప్ లో ఉండడాన్ని బట్టి ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్పలో స్పెషల్ సాంగ్ తో క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత, ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ను ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అలా సామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషితో పాటు హాలీవుడ్ సిటాడేల్ తెలుగు వెర్షన్ లోనూ సామ్ నటిస్తుంది.