Samantha: బాధితురాలిగా నటించిన విలన్.. సమంతపై ఆమె మేకప్ స్టైలిస్ట్ కామెంట్స్
Samantha: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు రెండో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోని లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది.
ఈ శుభవార్తను సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ వివాహంపై కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శలు, పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
నటి పూనమ్ కౌర్ తన X ఖాతాలో చేసిన ఒక ట్వీట్ సమంత వివాహం తరువాత తీవ్ర చర్చకు కారణమైంది. “సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. పురుషులను డబ్బుతో కొనుగోలు చేయవచ్చు. అహంకారంతో నిండిన ఒక మహిళను పీఆర్ టీమ్ గొప్పగా చూపిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో స్పష్టత లేకపోయినా, సమంత పెళ్లి నేపథ్యంలో దీనిపై నెటిజన్ల దృష్టి పడింది.
ఇదే సమయంలో సమంతకు గతంలో పర్సనల్ మేకప్ స్టైలిస్టుగా పనిచేసిన సద్నా సింగ్ కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేశారు. “బాధితురాలిగా విలన్ చాలా బాగా నటించింది” అని ఆమె రాశారు. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమె సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరోక్ష వ్యాఖ్యలన్నీ సమంతను ఉద్దేశించినవేనని నెటిజన్లు భావిస్తున్నారు.
సమంత – రాజ్ నిడిమోరుల వైవాహిక బంధంపై వస్తున్న ఈ భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాగా, రాజ్ నిడిమోరుకు ఇది రెండో వివాహం. ఇదివరకే ఆయనకు శ్యామలీతో వివాహం జరిగి, వారికి పిల్లలు కూడా ఉన్నారు. విడాకుల తర్వాత ఇప్పుడు ఆయన సమంతను వివాహం చేసుకున్నారు.
