Samyuktha Menon: సంయుక్త మీనన్ హవా.. చేతిలో 9 భారీ చిత్రాలు, వాటిలో 7 పాన్-ఇండియా సినిమాలే
Samyuktha Menon: స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే తెలుగు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఎంత ముఖ్యమో సంయుక్త మీనన్ తన కెరీర్‌తో నిరూపించారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ నటి, అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ఒక్క స్టార్ హీరోతో జతకట్టకపోయినా, ప్రస్తుతం ఆమె అత్యంత క్రేజీయెస్ట్ పాన్-ఇండియా హీరోయిన్‌గా మారింది. ఆశ్చర్యకరంగా, ఆమె చేతిలో ఏకంగా 9 సినిమాలు ఉన్నాయి, వీటిలో 7 చిత్రాలు పాన్-ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం.
‘భీమ్లా నాయక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త, ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించి లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ‘సార్’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి విజయాలతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. మలయాళంలో 15కు పైగా సినిమాలు చేసినా రాని గుర్తింపు, కేవలం ‘భీమ్లా నాయక్’ ద్వారా లభించింది. టాలీవుడ్ సపోర్ట్‌తో తమిళం, కన్నడ భాషల్లోనూ అవకాశాలు దక్కించుకున్న సంయుక్త, ‘మహారాగిణి’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం సంయుక్త మీనన్ పలు ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో నిఖిల్ సరసన ‘స్వయంభు’, శర్వానంద్‌తో ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘హైందవ’ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. అలాగే, ఆమె బాలకృష్ణతో కలిసి వాణిజ్య ప్రకటనల్లో నటించిన అనుభవం దృష్ట్యా, మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’లో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ద్విభాషా చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది.
దక్షిణాదిలో కన్నడ మినహా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న సంయుక్త.. మలయాళంలో మోహన్ లాల్ సరసన ‘రామ్’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో ‘బెంజ్’ చిత్రంలో నటిస్తోంది.
తాజాగా సంయుక్త మీనన్ లేడీ ఓరియెంటెడ్ జానర్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న మహిళా-కేంద్రీకృత చిత్రానికి ‘ది బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్ పెట్టారు. విడుదలైన పోస్టర్‌ను చూస్తుంటే, సంయుక్త ఇందులో యాక్షన్ హీరోయిన్‌గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చేతిలో 9 సినిమాలు, వాటిలో 7 పాన్-ఇండియా ప్రాజెక్టులు చేస్తూ, సంయుక్త మీనన్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
