Samyuktha Menon : తెలుగులో భీమ్లా నాయక్, విరూపాక్ష, బింబిసార వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ఆడియన్స్ ని బాగానే అలరించిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి దాదాపు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. అయితే ఈ అమ్మడు మలయాళంలో 2016 వ సంవత్సరంలో పాప్కార్న్ అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ఆరంభించింది. కానీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. అలాగే కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ అమ్మడు నటించిన మలయాళం మరియు తమిళ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో కొంతకాలంపాటు మలయాళం ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుని తెలుగులో ఆఫర్ల కోసం ట్రై చేసింది.
విరూపాక్ష చిత్రంతో Samyuktha Menon బ్లాక్ బస్టర్ హిట్:
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్, సాయి తేజ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. కానీ ఇందులో కూడా బీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త మీనన్ పాత్ర నిడివి తక్కువగా ఉండటం అలాగే బింబిసార చిత్రం లో ఫుల్ లెంగ్త్ రోల్ అయినప్పటికీ పెద్దగా డైలాగులు ప్రభావిత చేసే సన్నివేశాలు లేకపోవడంతో తెలుగులో ఈ అమంది కెరీర్ కొంతమేర చప్పగా సాగింది. సరిగ్గా అదే సమయంలో విరూపాక్ష చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ వరించింది. దీంతో మళ్ళీ సంయుక్త మీనన్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. కానీ ఈ మధ్య సంయుక్త మీనన్ కొత్త సినిమాలకి ఒకే చెప్పడం లేదు.

సంయుక్త మీనన్ కి ఆఫర్లు కరువయ్యాయని టాక్:
దీంతో నటి సంయుక్త మీనన్ కి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్ల విషయంలో గతంలో ఓ ప్రముఖ సినీ డైరెక్టర్ సపోర్ట్ చేసేవాడని కానీ ఈ మధ్య వీరిద్దరి మధ్య మైత్రి చెడిందని అందుకే మళ్ళీ సంయుక్త మీనన్ కి ఆఫర్లు కరువయ్యాయని కొందరు చర్చించుకుంటున్నారు. అలాగే సంయుక్త మీనన్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతోందని అందుకే కొత్త సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని మరికొందరు అంటున్నారు. కానీ సంయుక్త మీనన్ మాత్రం తన పెళ్లి గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో సంయుక్త మీనన్ తెలగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. కాగా డెవిల్ చిత్రం తర్వాత ఈ అమ్మడికి సంబంధించిన సినీమా సమాచారం లేదు.