ఢీల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబు ను బీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం ఆయన భార్య ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఎటువంటి సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు దాదాపు 6 గంటల పాటు సోదాలు నిర్వహించి, మూడు పుస్తకాలు, లాప్ టాప్, సెల్ ఫోన్, హార్డ్ డిస్క్జ్ పెన్ డ్రైవ్స్ తీసుకెళ్లారని హనీ బాబు భార్య Dr Jenny Rowena ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. Dr Jenny Rowena ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని Miranda House మహిళా కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది.
ఎటువంటి అనుమతి లేకుండా సోదాలు నిర్వహించడాన్ని ఢీల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ Dr.Rajib Ray ఖండించారు.