కరోనా వైరస్ గురచి బాహ్య ప్రపంచం కి తెలిసిన కొత్తలో, అసలు మన ఇండియాలో లాక్‌డౌన్ పెట్టిన కొత్తలో.. ఇటలీ లో కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు మీడియా ముందు దిక్కుతోచని స్థితిలో కంటనీరు పెట్టుకున్నాడు. ఏంజరుగుతుందో తెలిసేలోపే వైరస్ చాలామందిని ఆక్రమించేసింది. హాస్పిటల్స్ లో బెడ్ లు సరిపోనంతగా.. వైద్యులు సరిపోనంతగా.. చనిపోయిన శవాలని పూడ్చే దిక్కులేని స్థితికి ఇటలీ వెళ్లిపోయింది. శవాలు పూడ్చేందుకు ఇటలీలో మిలటరీ రంగంలోకి దిగాల్సిన పరిస్తితులు వచ్చాయి.
కాగా, వేసవికాలంలో మేజర్ యూరప్ దేశాలలో వైరస్ వచ్చినా ఇటలీని మించి ఏ దేశంలొ వైరస్ అంతగా జనంలోకి వెళ్లలేదు. కారణం యూరప్ దేశాలు చాలా కఠినంగా లాక్ డౌన్ అమలు పరచడమే. అయితే ఇప్పుడు శీతాకాలం మొదలైంది. ఫ్రాన్స్, స్పెయిన్, యూకే తో కొంచెం కొంచెం గా మొదలైన వైరస్ పతాక స్థాయికి చేరుకుంటుంది.
కరోనా అనేది మొదలయ్యాక నిన్న ఇటలీలో ఒక్కరోజులో నమోదు అయిన కేసులు 7,332 – ఇది గతంలో మార్చిలో నమోదు అయిన ఒక్కరోజు అత్యధిక కేసుల రికార్డు ని బద్దలుకొట్టింది. గత మార్చిలో అత్యధికంగా 6,554 కేసులు నమోదు అయ్యాయి.
కానీ ఈసారి అత్యధిక కేసులు రికార్డు నమోదు అయినా మరణాలు విషయంలో చాలా కంట్రోల్ గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మాదిరి తెలిసేలోపే వైరస్ జనంని ముంచే అవకాశం లేదు. అందరూ ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే టైం లో వైరస్ మొదలైనప్పుడు ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు లేకపోవడం కూడా ఒకకారణం కావొచ్చు. చాలా దేశాలు శాస్త్రవేత్తలు చెప్తున్న దాన్ని బట్టి వైరస్ చాలా వరకూ బలహీనపడి జనంలోకి విస్తరిస్తుంది. ఆ కారణంగా మరణాలు రేటు చాలా తక్కువగా ఉండొచ్చు అని అంటున్నారు.