Secunderabad Swapnalok Fire Accident :సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం… కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ సాయంత్రం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.అయితే ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది చిక్కుకోగా వారిలో ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మిగతా 7 గురిలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు ప్రమాదం నుండి భయపడ్డవారు తెలిపారు.
ప్రస్తుతం భవనంలో చిక్కుకున్నవారు బయటపడే పరిస్థితి లేదని, వారెవరూ ఫోన్లకి స్పందించట్లేదని, మంట వల్ల వస్తున్న పొగ వల్ల,లోపల ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.