Seethakka Power in Telangana Elections : తెలంగాణలో కాంగ్రెస్ జోరు సాగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ తొలి విజయంతో బోని చేయగా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఆనందం నెలకొంది. అయితే హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ధనసరి అనసూయ అలియా సీతక్క.
ఇప్పుడు సీతక్క మీద వరుస ట్వీట్ల తో అటు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. సీతక్క చాలా మంచి నాయకురాలు. తనను ఓడించడానికి బీఆర్ఎస్ చాలా పన్నాగాలే పన్నింది అని చెప్పవచ్చు. ఏకంగా 200 కోట్లు ఆమెను ఓడించడానికి వినియోగించారని తెలుస్తుంది.

కానీ వాటన్నిటికీ స్వస్తి చెప్తూ మొదటి రౌండు కౌంటింగ్ నుంచే సీతక్క ఆదిత్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బిజెపి అభ్యర్థి ప్రహ్లాద నాయక్ సీతక్క దాటిన తట్టుకోలేక వెనుకంజలో ఉన్నారు. సీతక్క మొదటి నుండి కూడా ప్రజల మనిషి. కరోనా సమయంలో ఆమె చేసినటువంటి సేవలు అనిర్వచనియం. తన ఎప్పుడు పేదల పక్షాన మాట్లాడుతుంది. ప్రజల మధ్యలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా సీతక్కను గెలిపించడానికి ప్రధాన కారణాలు. సీతక్క మీద ఉన్నటువంటి తమ అభిమానాన్ని ములుగు ప్రజలు మరోమారు చాటుకున్నారు.
