హైదరాబాద్ SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ 2nd ఫ్లోర్ నివసిస్తున్న తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి మౌనరాగం, మనసు మమత లాంటి పలు సీరియల్స్ లో నటిస్తున్న కొండపల్లి శ్రావణి.. గత కొన్ని సంవత్సరాలుగా తనకు టిక్ టాక్ లో పరిచయం అయిన కాకినాడ గొల్లప్రోలు కు చెందిన దేవరాజు రెడ్డి తో స్నేహం చేస్తుంది.
ఆ పరిచయంతో అతను తరచూ శ్రావణిని వేధింపులకు గురి చేసేవాడనీ అతని వేధింపులు తాళలేకే శ్రావణి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది అని దేవరాజు రెడ్డి పై SR నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు శ్రావణి కుటుంబ సభ్యులు. పోలీసులు మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. మా అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న శ్రావణి తమ్ముడు శివ, ఈ విషయం పై కేసు నమోదు చేసిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.