Shah Rukh Khan : సినిమా హీరోలు కనబడితే వారిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడటం సాధారణం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. షారుఖ్ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తే ఇక ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఓ వైపు మీడియా, మరోవైపు అభిమానులు అడుగుతీసి అడుగు వేయనివ్వరు. ఇబ్బంది పడుతున్న పట్టించుకోకుండా సెల్ఫీలు, ఫొటోలు తీస్తుంటారు. ఒక్కోసారి ఇది అతన్ని ఓవర్ రియాక్ట్ అయ్యేలా చేస్తుంది.
తాజాగా అలాంటి ఘటనే జరిగింది. షూటింగ్ ముగించుకొని ముంబయి ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన షారూఖ్ కి ఆయన ఫ్యాన్స్ కి కనిపించారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. సెల్ఫీకి పోజ్ ఇవ్వమని కనీసం షారుఖ్‌ను అడక్కుండానే.. పక్కన నడుస్తూ మొబైల్‌తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. ఇది షారుఖ్‌కు చికాకు తెప్పించింది. వెంటనే చేత్తో ఆ అభిమానిని పక్కకు నెట్టేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడం.. వైరల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి.
అభిమానిని నెట్టేసే దృశ్యం మాత్రమే చూస్తే.. షారుఖ్ కొంచెం దురుసుగా ప్రవర్తించినట్లు అనిపించినా.. మొత్తం వీడియో చూస్తే మాత్రం అభిమానిదే తప్పు అని అర్థమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో చిరాకు పుట్టి స్టార్లు ఫోన్లు విసిరేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వాళ్లతో పోలిస్తే షారుఖ్ కాస్త బెటర్‌గానే రియాక్టయినట్లే. అభిమాన హీరో, హీరోయిన్స్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగేటపుడు కనీసం అనుమతి అడగాలి కదా అని కొంతమంది షారుక్ ఖాన్ కు సపోర్ట్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Crw_CjEMnKE/?igshid=YmMyMTA2M2Y=
Discussion about this post