అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు అన్న వార్తల్లో నిజమెంతో గానీ తెలంగాణా లో సొంత కుంపటి పెట్టారు షర్మిల.. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.
నిన్న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న షర్మిళను ” ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చడం ఈ సంస్కృతి ఎంతవరకు కరెక్ట్..?” అని ఒక విలేకరి ప్రశ్నించగా..
ఏం పేరు..? దేని పేరు..? అంటూ ఆ విలేకరిని “ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు కదా.. దాని గురించి..” అని అడిగే వరకూ షర్మిళ రెట్టించారు.
ఫైనల్ గా ఆ క్వశ్చన్ క్లియర్ గా అడిగాక.. “మార్చడం తప్పు.. ఒక్కసారి ఒక పేరు పెట్టాక అది కంటిన్యూ చేస్తే వాళ్లకు గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది.. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.. ఒక్కొక్కసారి ఒక్కో పేరు పెడితే ఎవరు ఏది పెడుతున్నారో తెలీకుండా పోతుంది జనాలకి” అంటూ నవ్వుతూ జగన్ కి చురకలు అంటించారు..
