Shubman Gill Double Century: టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల 132 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు), రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజులు) చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచులో 149 బంతుల్లోనే 208 పరుగులు చేశాడు. 19 బౌండరీలు, 9 సిక్సర్లు దంచికొట్టాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాది ద్విశతక సంబరాలు చేసుకోవడం ప్రత్యేకం.
తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ నిరాశపర్చినా వన్డేల్లో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ క్రికెట్ లవర్స్ లో ఆనందం నింపింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కూడా శుభ్‌మన్ గిల్ సెంచరీ (116 పరుగులు) సాధించిన సంగతి తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న గిల్ న్యూజిలాండ్ వన్డేలో కూడా తన దూకుడు కొనసాగించాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ, ఇండియాకు మంచి ఓపెనర్‌గా నిలుస్తున్నాడు.
Also Read : శృంగారానికి దూరమైతే ఎంత ప్రమాదమో తెలుసా..!? Romance Benefits | Health Benefit of Romance
తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 10 పరుగులే చేసి నిరాశ పరిచాడు. మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 5 పరుగులే చేసి ఔటయ్యాడు. లేటెస్ట్ సెన్సేషన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 31 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 50 ఓవర్లలో టీంఇండియా 349 పరుగులు సాధించి ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు సవాల్ విసిరింది.
𝟔.𝟔.𝟔.
𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 😱🤩😱
Take a bow, @ShubmanGill 💯💯#INDvNZ pic.twitter.com/wwvQslGTxb
— BCCI (@BCCI) January 18, 2023