Shweta Tiwari: 45 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ.. శ్వేతా తివారీ లేటెస్ట్ గ్లామరస్ లుక్స్ వైరల్
Shweta Tiwari: బాలీవుడ్ బుల్లితెరపై తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న నటి శ్వేతా తివారీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్‌తో టీవీ రంగంలో అడుగుపెట్టిన శ్వేత.. అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మేరే డాడ్ కి దుల్హాన్’, ‘బాల్వీర్’ వంటి అనేక విజయవంతమైన షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచారు.
వృత్తి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన శ్వేతా తివారీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 18 ఏళ్ల వయసులోనే భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె పాలక్ తివారీ జన్మించినప్పటికీ, ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత 2013లో నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు రేయాన్ష్ పుట్టారు. అయితే, ఈ రెండో వివాహం కూడా మూడేళ్లకే ముగిసింది. రెండుసార్లు విడాకులు తీసుకున్న తర్వాత, శ్వేతా తివారీ ఒంటరిగా ఉంటూ తన కుమార్తె పాలక్, కుమారుడు రేయాన్ష్‌ను అన్నీ తానై చూసుకుంటూ ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుతం 45 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ, శ్వేతా తివారీ అందం, ఫిట్‌నెస్ విషయంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. తన యవ్వన సౌందర్యం, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఆమె కుర్రకారును కట్టిపడేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటారు.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో శ్వేత చాలా స్టైలిష్ లుక్స్‌లో కనిపించారు. ఆమె ఫిట్‌నెస్, వయసును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో కూడా ఇంతటి గ్లామర్‌ను మెయింటెయిన్ చేయడంపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్వేతా తివారీ ఫిట్‌నెస్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
