Siddharth Luthra : ఏపీ రాజకీయాలలో ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. శనివారం ఉదయాన్నే ఆరు గంటలకు సిఐడి పోలీసులు నంద్యాలలో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆంధ్రలో ఇదే హాట్ న్యూస్ గా నడుస్తుంది. ఆంధ్ర రాజకీయాల్లో ఇదొక కీలక అంశంగా మారిపోయింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బాబునీ అరెస్ట్ చేసినట్లు సిఐడి అడిషనల్ డీసీ సంజయ్ తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తరఫున వాదించడానికి న్యాయవాది సిద్ధార్థ లూత్ర నియమింపబడ్డారు. ఈయన ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ టిడిపి చంద్రబాబు కోసం దేశంలోనే టాప్ న్యాయవాదిగా పేరుపొందిన సిద్దార్ ను నియమించుకోవడం అత్యంత ఖరీదైన విషయమే అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
సిద్దార్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్ర చేరుకున్నారు. ఈయన ఫీజు ఒక రోజుకు1.50 కోట్లు చెల్లించవలసి ఉంటుందని సమాచారం. సిద్ధార్థ పీజ్ మాత్రమే కాకుండా ఆయన ఉన్నాన్ని రోజులు ఆయన మెయిన్టనెన్స్ కూడా అత్యంత ఖరీదైన చెప్పవచ్చు. లగ్జరీ రూము స్టార్ హోటల్ మిగతా అన్ని కూడా చాలా కాస్ట్లీ. విజయవాడలోని ఏసీబీ కోడ్ లో చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ తన వాదనలు వినిపించనున్నారు.
గతంలో కూడా అమరావతి భూముల కేసులను సిద్ధార్థ టేకప్ చేశారు. వివేక్ హత్య కేసులోనూ సునీత తరఫున సిద్ధార్థ నే వాదించారు. ప్రముఖ న్యాయవాది కె.కె. లుథ్రా కూడా న్యాయవాది. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఢిల్లీ యూనివర్సిటీ న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1990లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన సిద్దార్థ్. న్యాయ సంబంధ అంశాలపై అధ్యయనం కూడా చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పలు పుస్తకాలను కూడా రాశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల కోర్టుల్లోనూ సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ్ లూథ్రాకు ఉంది. మరోవైపు సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, వివేకానంద వాదనలు వినిపించనున్నారు.