SIIMA Awards 2025: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ చిత్రం కల్కి.. సైమా అవార్డుల వివరాలు
SIIMA Awards 2025: సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (SIIMA Awards 2025) వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. 2024లో తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ వేదికగా పురస్కారాలు అందిస్తున్నారు. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాలకు సంబంధించిన అవార్డుల ప్రకటన అట్టహాసంగా జరిగింది. ఈ సంవత్సరం అవార్డుల వేడుకలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఉత్తమ చిత్రంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే, అవార్డుల జాబితాలో అత్యధిక పురస్కారాలు దక్కించుకుని ‘పుష్ప 2: ది రూల్’ చిత్ర బృందం సత్తా చాటింది. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకోగా, రష్మిక మందన ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే, ఈ ఫ్రాంఛైజ్‌ను అద్భుతంగా రూపొందించిన సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని అందుకోగా, దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు.
‘సైమా’ 2025 అవార్డుల విజేతలు వీళ్లే!
- ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప2)
- ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)
- ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2)
- ఉత్తమ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)
- ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప2)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
- ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే – దేవర)
- ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్ (చుట్టమల్లే – దేవర)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: శంకర్ బాబు (పీలింగ్స్ – పుష్ప2)
- ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
- ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (హనుమాన్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్)
- ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్)
- ఉత్తమ దర్శకుడు (కన్నడ): ఉపేంద్ర (యూఐ)
- ఉత్తమ నటుడు (కన్నడ): కిచ్చా సుదీప్
- ఉత్తమ నటి (కన్నడ) : ఆషిక రంగనాథ్
- ఉత్తమ చిత్రం (కన్నడ): కృష్ణం ప్రణయ సఖి
