Skin Problems : పెరుగుతున్న వాతావరణం కాలుష్యం వల్ల చర్మ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. చర్మం కాంతిహీనం అవుతూ ఉంటుంది. చర్మాన్ని సజీవంగా ఉంచడం కోసం నానా రకాల క్రీమ్స్ అప్లై చేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో దొరికే సహజ వస్తువులతోటే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు అవి ఏమిటో తెలుసుకుందాం…
చర్మ సంరక్షణ కోసం పెరుగు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది మన ఇంట్లో రోజూ ఉండేది కాబట్టి దీనినీ వాడి చర్మాన్ని రక్షించుకోవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మాన్ని మాశ్చరైజ్ చేస్తుంది. అలాగే ముడతలు మరియు ఫైన్ లైన్లను నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే టాన్ మరియు డార్క్ సర్కిల్స్ ను తగ్గించడం కూడా సహాయపడుతుంది.
పెరుగు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. మొటిమల నుండి మచ్చల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పెరుగు రోజు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది. దాన్ని స్కిన్ పైన తుడవడం వల్ల పట్టుకున్న మురికి అంత తొలగిపోతుంది.
అలాగే పెరుగులో తేనె, నిమ్మ, ఓట్స్ కలిపి కూడా ఫేస్ ప్యాక్ లాగా చేసి ప్యాక్ వేసుకోవచ్చు. పెరుగును చర్మంపై అప్లై చేసి 15 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ఇంకెందుకు ఆలోచన మన ఇంట్లో ప్రతిరోజే ఉండు పెరుగును ఇలా వాడుకొని చర్మ సౌందర్యాన్ని పొందుదాం..