Sleep : ఒక మనిషికి శ్వాస, తిండి,నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఒక మనిషి సగటున ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండగలడు. నిద్రను ఆపుకోవడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనిషి శ్వాస తీసుకోవడం ఆపినప్పుడు ఆ మనిషి చనిపోయాడని అర్థం. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అలాగే మనిషికి తిండి, నీరు వీటితోపాటు నిద్ర కూడా చాలా అవసరం.
సరైన నిద్ర లేకపోతే ఆ మనిషి ఎన్నో అనారోగ్య సమస్యలను అనుభవించి చివరికి మరణించేదశకు చేరుకోవచ్చు. నిద్ర మనిషికి ఒక ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోయిన మనుషులు చాలా శక్తివంతంగా తయారవుతారు. ఒక వ్యక్తి చాలా రోజులు గనక నిద్రపోకుండా ఉంటే.. ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషికి సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం ఆరోజు అంతటి మీద పడుతుంది. ఆ రోజంతా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చాలా చిరాకును కూడా వాళ్ళు ఫీలవుతారు. రోజువారి నిద్రలో కాస్త అటు, ఇటు అయినా అలసిపోయినట్లుగా అయిపోతారు. ఒక మనిషికి ప్రతిరోజు సుమారు 8 గంటలసేపు నిద్ర అవసరం. లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగినంత నిద్ర లేకపోతే గుండె నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని అధ్యయనాల ప్రకారం కంటి నిండా నిద్రపోకపోతే చనిపోయే అవకాశాలు ఉన్నాయని తేలింది. 11 రోజులపాటు నిద్ర లేకపోతే మొదటగా అతని మానసిక స్థితి దెబ్బతిని 12వ రోజు అతను మరణిస్తాడు. కాబట్టి అందరూ నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించి సరైన సమయానికి, సరైన నిద్రను పోతే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.