Sonakshi Sinha: కొత్త లుక్స్‌తో రచ్చ చేస్తున్న సోనాక్షి సిన్హా.. పెళ్లైనా తగ్గని సొగసు
Sonakshi Sinha: బాలీవుడ్ అగ్ర నటీమణుల్లో ఒకరైన సోనాక్షి సిన్హా ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు, వ్యక్తిగత జీవిత విశేషాలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం ‘జటాధర’ విడుదలైన నేపథ్యంలో, సోనాక్షి కొత్త ఫోటోషూట్‌లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్ లుక్స్‌తో కూడిన ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా నట వారసురాలిగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా, మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసి ఆ తర్వాత నటనపై దృష్టి సారించారు. ఆమె 2010లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దబాంగ్’ ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ‘దబాంగ్’ సాధించిన అఖండ విజయంతో సోనాక్షి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు. కలువల్లాంటి కళ్లతో, బొద్దుగా ముద్దుగా కనిపించే ఆమె, తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు.
‘దబాంగ్’ తర్వాత రౌడీ రాథోడ్, దబాంగ్ 2, లూటేరా, ఆర్ రాజ్‌కుమార్ వంటి అనేక కమర్షియల్ హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ అభిరుచి గల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో బిజీగా ఉన్న సమయంలోనే రజనీకాంత్ సరసన ‘లింగ’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.
సోనాక్షి సిన్హా కెరీర్‌లో తొలిసారిగా తెలుగులో నటించిన చిత్రం ‘జటాధర’. సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె ‘ధన పిశాచి’ పాత్రలో కనిపించారు. నవంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
వ్యక్తిగత విషయానికి వస్తే, నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన సోనాక్షి, పెద్దల అంగీకారంతో 2024 జూన్ 23న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వేర్వేరు మతాలకు చెందిన వీరి వివాహంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా, సోనాక్షి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలిచారు. ప్రస్తుతం ఆమె అభిమానులందరూ.. ఈ జంట నుంచి ‘గుడ్ న్యూస్’ (తల్లి కాబోతున్న వార్త) ఎప్పుడు వింటామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
