Sonal Chauhan: డోస్ పెంచేసిన సోనల్ చౌహాన్.. పీక్స్‌లో అందాల ఆరబోత
Sonal Chauhan: లెజెండ్’, ‘పండగ చేస్కో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల నటి సోనాల్ చౌహాన్, సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో సోనాల్ ఆకుపచ్చని డ్రెస్‌లో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు మతి పోగొట్టేలా పోజులిచ్చింది.
ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సోనాల్, సినిమాలతో బిజీగా లేకపోయినా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫొటోషూట్‌లను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్రీన్ డ్రెస్ ఫొటోలపై నెటిజన్లు ‘వావ్’, ‘స్టన్నింగ్’, ‘సూపర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 38 ఏళ్ల వయసులో కూడా ఇంత అందంగా కనిపించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మోడలింగ్ నుండి వెండితెరకు..
సినిమాలతో పాటు మోడలింగ్ రంగంలోనూ సోనాల్ తన ప్రతిభను చాటుకుంది. 2005లో ఆమె ‘ఫెమినా మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. మోడలింగ్ తర్వాత ‘జన్నత్’ అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘రెయిన్‌బో’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ‘లెజెండ్’ సినిమా తర్వాత తెలుగులో సోనాల్ నటించిన చిత్రాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో ఆమె తెలుగు పరిశ్రమకు కొంత దూరమయ్యారు.
సోషల్ మీడియాలో సోనాల్ ఫాలోయింగ్..
సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో సోనాల్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఫాలోయింగ్‌తో ఆమె బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ఈ తాజా ఫొటోషూట్ ద్వారా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.