Sonia Gandhi Quitting Politics : కాంగ్రెస్ కి భారీ షాక్…!! రాజకీయాలకి సోనియా గుడ్ బై..?
నేటి రాజకీయాల్లో కాంగ్రెస్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సోనియాగాంధీ. కాంగ్రెస్ అంటే సోనియా, సోనియా అంటే కాంగ్రెస్ అన్న అన్నట్లుగా ఉన్న తరుణంలో సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కనీసం వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు అయినా రాజకీయాల్లో ఉంటూ మోడీ ఆధ్వర్యంలోని బిజెపిని ఎదుర్కోవడం లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని భావించిన కాంగ్రెస్ నేతలకి, భాగస్వామ్య పక్షాలకి సోనియా నిర్ణయం ఊహించని పరిణామం గా చెప్పుకోవచ్చు.
పైగా మోడీని ఓడించాలి అంటే విపక్షాలు అన్నీ ఏకమై ఒకే గొడుగు కిందకి వచ్చి కలిసి పనిచేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్న తరుణంలో, విపక్షాలని ఎలాగైనా ఒప్పించేందుకు సోనియా చొరవ తీసుకోవాలని, ఇందుకు ఆమెనే సరైన వ్యక్తి అని ఇటీవల నితీష్ కుమార్ తో పాటు వివిధ పార్టీల అధినేతలు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా చత్తిస్ ఘడ్ లోని రాయపూర్ లో జరుగుతున్న జరుగుతున్న పార్టీ 85 వ జాతీయ మహాసభల్లో చేసిన సోనియా ప్రకటన ఆ ఆశలపై నీళ్ళు చల్లింది.
ఈ అంశం పై సోనియా మాట్లాడుతూ రాహుల్ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అని… ఈ యాత్ర ముగిసిన సమయంలోనే తన రాజకీయ ఇన్నింగ్స్ ముగించడం చాలా సంతోషం కలిగించింది అని అన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని, పేదల కోసం పోరాడడానికి ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. చూడాలి మరి సోనియా తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..!!