కర్నూలు శ్రీశైలం డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. డ్యాం ప్లంజ్ పూల్ కింద భారీగా గుంతలు ఏర్పడ్డాయి. 6, 8 గేట్ల వద్ద గుంతలు పెద్దవిగా అవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. 2002లో వేసిన కాంక్రీట్..వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో డ్యాం లోపలికి గొయ్యి విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
డ్యాం మరమ్మతులకు సుమారు రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది.
2009లో శ్రీశైలానికి భారీ వరద వచ్చినపుడు డ్యాం దిగువన రెండు వైపులా దెబ్బతింది. అప్పటినుండి పలు కమిటీలు డ్యాం భద్రతపై పలు సార్లు పరిశీలించి రక్షణ పరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నాయి.
గతంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం డ్యామ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు ప్రధానమైనదని, ఇరు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది రైతులు ఈ డ్యాం పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని అందువలన మరమ్మతులకు అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని, కేంద్రం కూడా తమ వంతు సాయం చేయాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు.