తిరుమల ఆలయంలో శ్రీవారి దర్శనానికి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయడం తిరిగి ప్రారంభించారు. గత నెల సెప్టెంబర్ 6 వ తేదీన తిరుపతిలో కరోనా విజృంభిస్తున్న కారణంగా టోకెన్ల జారీ నిలిపివేశారు.
మళ్ళీ తిరిగి నేటి నుండి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీ చేస్తున్నారు. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం మూడువేల టోకెన్లు జారీ చేయనున్నారు టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనం కల్పించనున్నట్లు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు తెలిపారు.