SSMB 29: మహేశ్-రాజమౌళి గ్లోబల్ ప్రాజెక్ట్‌పై భారీ అప్‌డేట్: నవంబర్ 15న టైటిల్ రివీల్ ఈవెంట్ లైవ్
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం కోసం సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తాత్కాలికంగా ‘SSMB 29’ లేదా ‘గ్లోబ్ ట్రాటర్’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో పిలుస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన కీలక అప్‌డేట్ నవంబర్ 15న రాబోతోంది.
ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలను వెల్లడించేందుకు నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్రాండ్ వేడుకను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ తమ వేదికపై లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నవంబర్ 15న జరగబోయే ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్‌ను అధికారికంగా రివీల్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లేదా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలతో కూడిన గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేయవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దర్శకుడు రాజమౌళి ఈ వేడుకలో పలు సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేశారని, టాలీవుడ్‌లోని కొంతమంది టాప్ హీరోలు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది జరిగితే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.
ఈ బృహత్తర ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇది భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను నెలకొల్పబోతుందని, అంతర్జాతీయ స్థాయిలో చిత్రీకరణ జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని, ఒరిస్సా, కెన్యా వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. త్వరలో నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ పాన్-వరల్డ్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. గ్లోబల్ బ్యూటీ తొలిసారి మహేష్ బాబుతో జతకట్టడం, వారిద్దరి కెమిస్ట్రీ తెరపై ప్రేక్షకులకు గొప్ప వినోదాన్నిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
