కరోనా నేపథ్యంలో ఒకపక్క ఇండియా మొత్తం ధియేటర్లు మూతపడిపోయాయి, దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ టైంలో దేశ ప్రజలు అందరికీ ఎంతో కొంత టైం పాస్ నుండి కాలక్షేపంకి టెలివిజన్ లే (టివి లు) దిక్కు అయ్యాయి.
అయితే తాజాగా బార్క్ ప్రకటించిన ఛానల్స్ రేటింగ్ లో మన తెలుగు ఛానల్ “స్టార్ మా” ఇండియా మొత్తం నెంబర్ వన్ గా నిలిచింది, ఎంటర్టైన్మెంట్ విభాగంలో స్టార్ మా ఈ ఘనత సాధించింది.
స్టార్ మా ఈ రికార్డు సాధించడానికి గల కారణం ఖచ్చితంగా మెజారిటీ భాగం కార్తీకదీపం సీరియల్ దే. ఎందుకంటే కార్తీకదీపం ప్రతీరోజు 18 పైగానే టీవిఆర్ రేటింగ్ సాధిస్తూ టెలివిజన్ రంగంలో టివిఆర్ రేటింగ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
అయితే కార్తీకదీపం ఒక్కటే కాదు “వదినమ్మ”, ” ఇంటింటి గృహలక్ష్మి ” లు కూడా మంచి రికార్డు రేటింగ్ లు సాధిస్తున్నాయి. పైగా బిగ బాస్, ఇస్మార్ట్ జోడీ లాంటీ రియాలిటీ షోలు కూడా మా టీవి నెంబర్ వన్ అవ్వడానికి కారణమే.