Strange Commands : ఆ ఆఫిస్ లోకి ఉద్యోగుల జీన్స్ వేసుకొస్తే..జరిమానా తప్పదు. ఈ వింత రూల్ పెట్టినది ఒక మేజిస్ట్రేట్. ఇంతకు ఆ ఆఫీస్ ఎక్కడ ఉందో..ఆ రూల్ పెట్టడానికి అసలు కారణం ఏంటో చూద్దాం.
బీహార్ లోని సరసన జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీస్ లో ఉద్యోగులు జీన్స్,టీ షర్ట్ వేసుకొని రావద్దు అంటూ మేజిస్ట్రేట్ అమర్ సర్క్యులర్ జారీ చేసారు. ఆఫీసుకు ప్రతిరోజు చాలా మంది మేజిస్ట్రేట్ లు వస్తుంటారు వాళ్ళలో అధికారులు ఎవరు అనేది గుర్తు పట్టడం కష్టంగా ఉంటుంది.

కాబట్టి ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలి, అదేవిదంగా ఐడి కార్డ్ (గుర్తింపు కార్డ్) కూడా ధరించాలి, దుస్తులు కూడా సాంప్రదాయకమైనవి మాత్రమే ధరించాలి అని ఆదేశాలు జారీ చేసారు. ఉదయం 10 గంటల లోపు ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా ఆఫీసులో ఉండాలని,పని వేళలా సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి,
ఈ విషయాల అన్నింటిమీద ఆఫీస్ లోని స్థితిగతులను తెలుసుకోడానికి వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సూచనలు ఎవరైనా పాటించకపోతే జరిమానా విధిస్తాము అని మెజిస్ట్రేట్ చెప్పారు. దుస్తుల విషయంలో ఇలాంటి ఆజ్ఞలు ఏంటి అని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు..
