Stranger Things: మూడేళ్ల నిరీక్షణకు తెర.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ సందడి షురూ
Stranger Things: ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫైనల్ సీజన్ (సీజన్ 5) ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు వచ్చింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సైన్స్ ఫిక్షన్ సిరీస్ నుంచి చివరి భాగం విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
‘స్ట్రేంజర్ థింగ్స్ – సీజన్ 5’ పేరుతో విడుదలైన ఈ తుది సీజన్‌ను నెట్‌ఫ్లిక్స్ ఒక్కసారిగా కాకుండా, మూడు వాల్యూమ్స్‌గా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించింది.
వాల్యూమ్ 1 (మొదటి 4 ఎపిసోడ్‌లు) నవంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. వాల్యూమ్ 2 (తరువాతి 3 ఎపిసోడ్‌లు) క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26, 2025న విడుదల కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ (8వది) న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, 2026న విడుదలై ఈ సిరీస్‌కు ముగింపు పలకనుంది.
సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు బలమైన ఎమోషన్స్‌తో నిండిన ఈ చివరి సీజన్ అద్భుతమైన వీడ్కోలు ఇస్తుందని నెట్‌ఫ్లిక్స్ ధీమా వ్యక్తం చేసింది. ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం సహా 25కు పైగా భాషల్లో డబ్బింగ్ అయి అందుబాటులో ఉండటంతో భారతీయ అభిమానులు కూడా దీని కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ చివరి సీజన్‌లో హాకిన్స్ పట్టణంలోని చిన్నారుల బృందం, గత సీజన్‌లో వీక్షకులను భయపెట్టిన విలన్ వెక్నా సృష్టించిన భయానక వాతావరణాన్ని, అప్‌సైడ్‌డౌన్ ప్రపంచంలోని సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ ఫైనల్ చాప్టర్ రూపొందించబడింది. హాకిన్స్ స్నేహితుల బృందం కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
