Street Dog Attack Incident : అంబర్ పేట్ చిన్నారి మృతి ఘటనపై కేసు నమోదు …. FIR గురించి పోలీసుల ఆసక్తికర వ్యాఖ్యలు ..!!
మూడురోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేట్ లో అత్యంత విశాదకరంగా కుక్కల దాడిలో చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి మృతిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే కేసు నమోదు కొరకు 3 రోజులపాటు న్యాయ సలహా తీసుకున్న పోలీసులు FIR పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.FIR కాపీలో బాలుడిని ఎవరు చంపారన్నది పేర్కొనలేదు.దీనిపై పోలీసులు మాట్లాడుతూ “విచారణ చేస్తున్నాం అని, విచారణ అనంతరం పేర్లు చేరుస్తాం అని తెలిపడం గమనార్హం” .
అయితే ఈ ఘటనకి సంభందించి హైకోర్ట్ కేసుని సుమోటో గా తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటివరకు కుక్కలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని తాజాగా GHMC అధికారులని,తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా ఇటీవల మరికొన్ని చోట్ల కూడా కుక్కల దాడులు జరుగుతుండడంతో ప్రజలు భయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. కనీసం ఇప్పటికైనా మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
