Street Food Kumari : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న స్ట్రీట్ ఫుడ్ కుమారి గురించి దాదాపుగా తెలియని వారుండరు. ఇక ఎప్పుడైతే కుమారి స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అవ్వడం మొదలైందో అప్పటినుంచీ దుర్గం చెరువు రోడ్ లో ట్రాఫిక్ జామ్ కష్టాలు కూడా మొదలయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కుమారి స్ట్రీట్ ఫుడ్ ఎంతగా పాపులర్ అయ్యిందో అని. ఈ క్రమంలో తెలుగు ప్రముఖ హీరో సందీప్ కిషన్ కూడా తాను రీసెంట్ గా నటించిన భైరవకోన చిత్ర ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ సభ్యులతో కలసి కుమారి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళి భోజనం చేశాడు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళి భోజనం చేస్తానని చెప్పడంతో రోజురోజుకీ బాగానే ఫేమస్ అవుతోంది స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కుమారి.
బిగ్ బాస్ లోకి Street Food Kumari
అయితే తెలుగు ప్రముఖ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ లోకి కూడా కుమారి కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ నెటిజన్లు మాత్రం పెద్దగా నమ్మడం లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కుమారి ఇటీవలే ప్రముఖ టెలివిజన్ చానెల్ అయిన స్టార్ మా చానెల్ నిర్వహించిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీయూనియన్ ఈవెంట్ లో కంటెస్టెంట్లకి తన భోజనం రుచి చూపించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఈ విషయానికి సంబందించి సోషల్ మీడియాలో ఓ వీడియొ కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియొలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు భోజనం చేస్తున్నట్లు అలాగే కుమారి ని సత్కరించినట్లు కనిపిస్తోంది. దీంతో తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కుమారి కూడా కంటెస్టెంట్ గా పాల్గొనబోతోంది అంటూ మరోమారు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ ఇటు స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కుమారి గానీ అటు బిగ్ బాస్ షో నిర్వాహకులు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
బిగ్ బాస్ షోకి వెళుతున్నారా.?
ఈ విషయం ఇలా ఉండగా గతంలో కొందరు మీడియా మరియు వ్లాగర్లు బిగ్ బాస్ షోకి వెళుతున్నారా అని స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కుమారి ని అడగ్గా ఆమె కనీసం బిగ్ బాస్ అంటే ఏమిటో కూడా తెలియనట్లు మాట్లాడింది. ఈ క్రమంలో బిగ్ బాస్ షో అంటే వంటల ప్రోగ్రామ్ నా అంటూ తిరిగి ఎదురు ప్రశ్నలు అడిగింది. ఏదేమైనప్పటికీ ఒక సామాన్యమైన వ్యక్తిని ఎటువంటి ఖర్చు లేకుండా పాపులర్ చేయడం కేవలం సోషల్ మీడియాలోనే సాధ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
