Ram Charan: ‘రంగస్థలం’ను మించిన యాక్షన్ డ్రామా: రామ్‌చరణ్‌తో సుకుమార్ తదుపరి చిత్రం
Ram Charan: ‘పుష్ప 2’తో రికార్డు విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్.. తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఒక పెద్ద విజయాన్ని సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్, రామ్ చరణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా ఒక యాక్షన్ డ్రామానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సుకుమార్ బ్యాంకాక్ ట్రిప్..
‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. దీని కోసం తన టీమ్‌తో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లి కథా చర్చలు జరిపారు. అక్కడ కథకు ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ కథ ‘రంగస్థలం’ కంటే చాలా భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, సుకుమార్ రామ్ చరణ్‌తో ఒక ప్రేమకథ చేయాలని భావించారు. కానీ రామ్ చరణ్ ఇమేజ్, అతని అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని, ఒక భారీ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నారని సమాచారం. త్వరలోనే సుకుమార్ ఈ కథను రామ్ చరణ్‌కి వినిపించనున్నారు.
బిజీ బిజీగా రామ్ చరణ్..
ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మైసూరులో శరవేగంగా జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ ఒక సాంగ్ షూట్‌లో 1000 మంది డ్యాన్సర్లతో డ్యాన్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల అల్లు అరవింద్ తల్లి మరణించడంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చారు. తిరిగి వెళ్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ‘పెద్ది’ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. దీని తర్వాతే సుకుమార్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని భావిస్తున్నారు.
ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం..
రామ్ చరణ్ కథకు ఓకే చెప్పిన వెంటనే ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇద్దరి కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.