Sukumar Ramcharan: రామ్ చరణ్ – సుకుమార్ మూవీ అప్డేట్.. ఆ రిస్క్‌కు సిద్ధపడ్డ డైరెక్టర్.. ఏంటంటే?
Sukumar Ramcharan: టాలీవుడ్‌లో కృతిసనన్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఏ హీరో అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం సహజం. ఆమె తెలుగు హీరోలతో కలిసి నటించిన ప్రతిసారీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. అయితే, ఇదే సెంటిమెంట్ బాలీవుడ్‌కు వర్తించదు. అక్కడ ఆమె స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, ఆమెను టాలీవుడ్‌కు తిరిగి తీసుకురావాలని ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కృతిసనన్ తెలుగులో మహేష్ బాబుతో కలిసి నటించిన తొలి చిత్రం ‘1 నేనొక్కడినే’ మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం నిలబడలేకపోయింది. ఆ తర్వాత, నాగ చైతన్యతో నటించిన ‘దోచేయ్’ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కృతిసనన్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుస హిట్స్‌తో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది.
ఈ క్రమంలో, ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ సినిమాలో నటించింది. ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ విధంగా, టాలీవుడ్ స్టార్ హీరోలతో కృతిసనన్ నటించిన ప్రతి సినిమా నిరాశే మిగిల్చింది. అందుకే, టాలీవుడ్ మేకర్స్ ఆమెతో సినిమాలు చేయాలంటే వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ, సుకుమార్ తన తదుపరి చిత్రం కోసం కృతిసనన్‌ను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారట. సుకుమార్ దర్శకత్వంలో రాబోయే రామ్ చరణ్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమార్ ‘1 నేనొక్కడినే’ సినిమాతో కృతిసనన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు, తానే ఆమెకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సుకుమార్ రిస్క్ చేస్తున్నారా, లేదా లెక్కల మాస్టారు ఏదైనా కొత్త ప్లాన్‌తో వస్తున్నారా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ధనుష్‌తో తమిళంలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటిస్తున్న కృతిసనన్‌కు ఆ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.