Summer Health Tips:వేసవి కాలం వచ్చేసింది… ఆరోగ్యంతో పాటు చర్మం జాగ్రత్త మరి
వేసవి కాలం వచ్చేసింది అంటే చాలు భగభగ మండే ఎండలు. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే వేసవిలో చర్మం స్కానింగ్ నిగారింపు కోల్పోవడం,పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే రోజు ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా క్రమం తప్పకుండా జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సంరక్షణతో పాటు చర్మ కాంతి పెరిగి యవ్వనంగా కనిపిస్తారు.
ఆరెంజ్ జ్యూస్

టొమాటో జ్యూస్
టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజు టమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
దానిమ్మ జ్యూస్
శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్లే రోజు దాని ఇమేజెస్ సేవించడం ద్వారా చర్మం లో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు. అయితే అందులో పంచదార కలుపుకోకూడదు.
బీట్ రూట్ జ్యూస్
ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్ రూట్ జ్యూస్ ప్రతిరోజు బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
గ్రీన్ టీ
కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.