Ramayana: ‘రామాయణం’లో నా పాత్ర చాలా అల్లరిగా ఉంటుంది.. చెప్పుకొచ్చిన సన్నీ డియోల్
Ramayana: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపొందుతున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంపై నటుడు సన్నీ డియోల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో హనుమాన్ పాత్రను పోషిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నానని, ఈ పాత్ర సవాలుతో కూడుకున్నదని ఆయన అన్నారు. రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 45కి పైగా భాషల్లో విడుదల కానుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సన్నీ డియోల్ మాట్లాడుతూ, హనుమంతుడి పాత్ర చాలా ఉత్సాహంగా, సరదాగా ఉంటుందని తెలిపారు. ఈ పాత్ర చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని చెప్పారు. ఈ రోల్ చాలా సరదాగా అల్లరిగా ఉండడంతో పాటు ఉత్సహాంగా ఉంటుందని సన్నీ తెలిపాడు. ఇలాంటి పురాణ పాత్రలు పోషించడం అంత సులభం కాదని, అందులో పూర్తిగా లీనమైతేనే ప్రేక్షకులను మెప్పించగలమని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని పంచడానికి చిత్రబృందం నిరంతరం శ్రమిస్తోందని ఆయన అన్నారు.
ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని పంచడానికి చిత్రబృందం నిరంతరం శ్రమిస్తోందని ఆయన తెలిపారు. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘రామాయణం’ లాంటి మహాకావ్యాన్ని ఎన్నిసార్లు తెరకెక్కించినా కొత్తగానే ఉంటుందని, ఈ సినిమా ద్వారా రామాయణం గొప్పతనాన్ని ప్రపంచం మరోసారి తెలుసుకుంటుందని సన్నీ డియోల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్నారు. రవి దూబే లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్‌ను ప్రశంసిస్తూ, అతను గొప్ప నటుడని, రాముడి పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశారని సన్నీ చెప్పారు.
ఈ భారీ ప్రాజెక్టులో లారా దత్తా కైకేయిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుందని సమాచారం.