Sunny Leone: సన్నీ లియోన్ ఇంట్లో విష పురుగులు..!
Sunny Leone: ఒకప్పుడు అడల్ట్ స్టార్‌గా పేరు పొందిన సన్నీ లియోన్, ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక ప్రముఖ నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతీయ మూలాలున్న సన్నీ అసలు పేరు కరణ్ జిత్ కౌర్. 2012లో ‘జిస్మ్ 2’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీ, మొదట్లో అంతగా విజయం సాధించలేకపోయారు. కానీ 2014లో విడుదలైన హారర్ చిత్రం ‘రాగిణి MMS 2’తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్ చేస్తూ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
ఒక్కో ఐటెం సాంగ్‌కు ఎంతంటే?
తన 12 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించిన సన్నీ, కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక డ్యాన్సర్‌గా కూడా మంచి డిమాండ్‌ను సంపాదించుకున్నారు. ఒక్కో ఐటెం సాంగ్‌కి ఆమె రూ. 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితానికి వస్తే, 2011లో డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకున్న సన్నీ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు నోహ్, ఆషెర్ సొంత పిల్లలు.
https://www.instagram.com/reel/DNQf6tNoQ5A/?utm_source=ig_web_copy_link
ఆరోగ్యంపట్ల జాగ్రత్త సుమా..!
కెరీర్ ప్రారంభంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, తన కృషి, పట్టుదలతో సమాజంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న సన్నీ లియోన్, ఇప్పుడు అభిమానుల కోసం తరచూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన కిచెన్‌లో ఒక టమాటా కోస్తున్నప్పుడు అందులో నుండి విషపురుగు బయటకు వచ్చినట్లు ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచనలిచ్చారు. ప్రస్తుతం సన్నీ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం వినోదం పంచడమే కాకుండా, తన అభిమానులకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెప్పడంలో సన్నీ చూపించిన శ్రద్ధను నెటిజన్లు అభినందిస్తున్నారు.
