Superman OTT: సూపర్‌మ్యాన్ మూవీ OTT స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Superman OTT: డీసీ యూనివర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న పాత్ర ‘సూపర్‌మ్యాన్’. 1948 నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న ఈ ఫ్రాంఛైజీ, బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇటీవల విడుదలైన ‘సూపర్‌మ్యాన్’ చిత్రం కూడా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హీరో సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు జేమ్స్ గన్ వెల్లడించారు. ఈ శుక్రవారం సూపర్‌మ్యాన్ మీ ఇళ్లకు రాబోతున్నాడని, వీలైనంత త్వరగా థియేటర్లలో చూడండి అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా ఆగస్టు 15న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టమైంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలలో అందుబాటులోకి రానుంది.
ఈ సినిమాలో ప్రధానంగా హీరో సూపర్‌మ్యాన్ (కొరెన్స్వెట్) ధైర్య సాహసాలు, అతనికి ఎదురైన సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్ (నికొలస్ హోల్ట్), సూపర్‌మ్యాన్‌ను ప్రజలకు విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. సూపర్‌మ్యాన్ వల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని, అతన్ని అంతం చేయాలని ప్రభుత్వ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.
సూపర్‌మ్యాన్ పుట్టుకకు సంబంధించిన వీడియోను లూథర్ లీక్ చేసి ప్రజలలో అతడిపై ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ పరిస్థితుల్లో లెక్స్ లూథర్ చర్యలను అడ్డుకుని, తన నిజాయితీని సూపర్‌మ్యాన్ ఎలా నిరూపించుకున్నాడు, ఈ క్రమంలో అతని ప్రేయసి లోయిస్ లేన్ (రెచెల్), ఇతర సూపర్‌హీరోలు అతనికి ఎలా సాయం చేశారు అనే అంశాలు సినిమాను ముందుకు నడిపిస్తాయి. ఈ ఉత్కంఠభరితమైన కథనాన్ని చూడాలంటే సినిమా చూడాల్సిందే.
సహజంగా ఉండే భావోద్వేగాలను అద్భుతంగా పలికించాడు. క్లెంట్ కార్క్, సూపర్ మ్యాన్ రెండు పాత్రలను ఆయన సమర్ధవంతంగా పోషించారని చెప్పవచ్చు. రెచెల్ బ్యూటీ, నటనతో ప్రేక్షకులను అలరించింది. లెక్స్ లూథర్ అనే విలన్ పాత్రలో నికలస్ హోల్ట్ అద్భుతంగా నటించాడు. ఇతర నటులందరూ కూడా వారి పాత్రల పరిధిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.