జగన్ సర్కార్ కి కోర్టుల్లో ఎదురుదెబ్బల పరంపర ఆగడంలేదు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం అంశంలో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ సర్కారు సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25 వాయిదా వేసింది. కేవియట్ పిటిషన్ వేసినవారు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నిన్ననే మద్యం విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు ఇంగ్లీష్ మీడియం విషయంలో మరొక ఎదురుదెబ్బ తిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యధిక సార్లు కోర్టులలో తిరస్కరింపబడిన సీఎం వైయస్ జగన్ మాత్రమే అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.