Supreme Court Verdict on Abrogation of Article 370 : జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా మీద జరుగుతున్న పోరాటాలు, కాశ్మీరీల వాదన తెలిసిందే. జమ్ము కాశ్మీర్ సంబంధించి ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ ను రద్దు చేయడాన్ని సవాల్ చేసింది. దానిపైన పలు పిటీషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా తీర్పు విలువరించింది. ఇప్పుడు ఈ తీర్పు అందరిలో చాలా ఉత్కంఠతను రేపుతుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా పైన సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు సోమవారం రోజున తన తీర్పును బహిర్గతం చేసింది. అయితే ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని, దాంట్లో సుప్రీంకోర్టు తల దూర్చదని, ఎటువంటి నిర్ణయాన్ని తీర్చుకోలేదని స్పష్టం చేసింది.
అంతేకాకుండా పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టి పారేయలేమని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తో సహా ఆయన నేతృత్వంలోని సభ్యుల బెంచ్ తీర్పును ఇచ్చింది. దీనితో కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసేసింది. అయితే గతంలో జమ్మూ కాశ్మీర్ రాజు ఆర్టికల్ 370 తాత్కాలికమే అని యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని చెప్పారు. భారత రాజ్యాంగమే ఫైనల్ అని చెప్పి ఆనాడు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు, ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేసిన పిడిపి సహా కాశ్మీర్ పార్టీలు ,రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే సెప్టెంబర్ 5న రిజర్వులో పెట్టి ఉంచిన తీర్పును సోమవారం రోజు వెలువరించింది.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసింది. దీనిపైన చాలా ఆందోళనలు లేవనెత్తారు. చాలా రకాల పోరాటాలు జరిగాయి. రద్దును ఉపసంహరించుకోవాలని వేల గొంతులు ఏకమయ్యాయి. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే దీనిని స్థానిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాలు సవాల్ చేస్తూ ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ లను దాఖలు చేశారు.
ఇప్పుడు ఇటువంటి తీర్పును వెలువరించిన నేపథ్యంలో కాశ్మీర్ లో అధికారి యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత చర్యలను వెంటనే చేపట్టింది. రెండు వారాలుగా కాశ్మీర్ లో ఎవరైనా 10 జిల్లాల్లో భద్రత ఏర్పాట్లపై, పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొందరు నాయకులలో అదుపులోకి తీసుకోగా, మరికొందరిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.