Suriya Karuppu Teaser: సూర్య పుట్టినరోజు కానుక – కరుప్పు టీజర్ రిలీజ్
హీరో సూర్యకి హిట్టు పడి చాలా కాలమే అవుతోంది. మధ్యలో జై భీమ్ లాంటి క్రిటికల్లీ అక్లైమ్డ్ చిత్రంతో మెప్పించినప్పటికీ అది ఓటీటీలో రిలీజ్ అయింది. సో సూర్య చాలా కాలంగా సాలిడ్ థియేటర్ హిట్ విషయంలో ఫ్యాన్స్ కి బాకీ ఉన్నాడు. ఇటీవల సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం కంగువ.. ఆ తర్వాత వచ్చిన రెట్రో లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.
తాజాగా సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. నేడు జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో సూర్య మాస్ లుక్, మాస్ బీభత్సం సృష్టిస్తున్న యాక్షన్ ఎలిమెంట్స్ ఒక రేంజ్ లో పేలాయి. సూర్యకి ఇలాంటి మాస్ చిత్రం పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
టీజర్ ఎలా ఉందంటే ?
టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లో సూర్య మాస్ అండ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నారు. మాస్ అప్పీల్ తో పాటు టీజర్ లో డివోషనల్, ఫెస్టివ్ వైబ్స్ కూడా కనిపిస్తున్నాయి. ‘కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగొచ్చే దేవుడు అంటూ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది.

ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అతడు టీజర్ కి ఇచ్చిన బిజియం నెక్స్ట్ లెవల్ లో ఉంది. సూర్య మల్టిపుల్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. కొన్ని యాక్షన్ మూమెంట్స్ థ్రిల్ కలిగించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా ప్రతి టెక్నికల్ అంశంలో టీజర్ అదిరిపోయింది. డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటించనున్నారు.