Karuppu: దీపావళికి సూర్య ఊరమాస్ ట్రీట్.. ‘కరుప్పు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘గాడ్ మోడ్’ రిలీజ్
Karuppu: కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య నటిస్తున్న తాజా యాక్షన్ ప్రాజెక్ట్ ‘కరుప్పు’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నటుడు, దర్శకుడు అయిన ఆర్జే బాలాజీ రూపొందిస్తున్న ఈ సినిమాపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ అద్భుతమైన స్పందన పొందగా, మేకర్స్ తాజాగా మ్యూజిక్ అప్డేట్‌తో ప్రేక్షకులను మరింత ఉర్రూతలూగిస్తున్నారు.
ముందుగా ప్రకటించినట్టుగానే, ‘కరుప్పు’ సినిమా నుంచి మొదటి పాట ‘గాడ్ మోడ్’ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో ఊర మాస్ బీట్‌తో సాగుతూ.. సూర్య అభిమానులకు కనుల పండుగలా ఉండబోతుందని చెప్పకనే చెప్పింది. ఫుల్ ఎనర్జిటిక్ మ్యూజిక్, మాస్ విజువల్స్‌తో ఈ దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘గాడ్ మోడ్’ పూర్తి పాటను దీపావళి కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా సూర్య తన చేతిలో ఆయుధం పట్టుకున్న సరికొత్త లుక్‌ను కూడా విడుదల చేయగా, అది నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమాకు హైప్ తీసుకురానున్నారు.
‘కరుప్పు’ థియేటర్లలో ఎప్పుడు వస్తుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే డిజిటల్ రైట్స్ డీల్ కుదరడంలో ఆలస్యం కారణంగా విడుదల తేదీపై కొంత డైలమా నెలకొందనే వార్తలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, దర్శకుడు ఆర్జే బాలాజీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సినిమా అనుకున్న సమయానికి, పక్కా ప్రణాళికతో విడుదల కాబోతుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సూర్య మార్క్ యాక్షన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.