Symptoms of High Cholesterol : ఈ రోజుల్లో చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య కొలెస్ట్రాల్. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువ. అయితే ఈ సమస్య నుండి బయటపడాలంటే మనం ముఖ్యంగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.
కొలెస్ట్రాల్ మన శరీరంలో చేరకూడదు అంటే, సంతృప్త కొవ్వుల శాతం అధికంగా ఉన్న పదార్థాలకు మనం దూరంగా ఉండాలి. వాటిల్లో రెడ్ మాంసం, పాల ఉత్పత్తులు ప్రధానమైనవి. అలాగే కొలెస్ట్రాల్ మన శరీరంలో చేరితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా వాటిని గుర్తించి డాక్టర్ నీ సంప్రదిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
పాదాలు చల్లబడడం
మామూలుగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పాదాలు చల్లబడతాయి, కానీ వాతావరణం వేడిగా, మండు వేసవిలో కూడా మీ పాదాలు చల్లబడితే, అది అనారోగ్య సమస్యకు సంకేతం అని మీరు గుర్తించాలి. శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పెరిగితే పాదాలు చల్లబడుతాయి. అలాగే పాదాల రంగు,చర్మం రంగు కూడా మారే అవకాశం ఉంది. శరీరంలో రక్తం శాతం తగ్గినప్పుడు రక్తం ద్వారా శరీరంలోకి చేరే ఆక్సిజన్ పోషకాల సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అలాంటప్పుడు చర్మం, గోళ్ల రంగు మారడం ప్రారంభిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి.
కాళ్ల తిమ్మిర్ల తోపాటు బెల్లీ ఫ్యాట్
సహజంగా కొద్దిమందికి రాత్రి సమయంలో లేదా కాళ్లు మడుచుకొని కూర్చున్నప్పుడు తిమ్మిర్లు పడుతుంటాయి. అది సహజంగా జరిగేది. కానీ మాటిమాటికి కాళ్లు తిమ్మిర్లు పట్టి పాదంతో పాటు, చూపుడు వేలు, మడమ లేదా బొటనవేలు తిమ్మిరి పడితే మాత్రం ఈ సమస్య అధిక కొలెస్ట్రాల్ వల్ల జరుగుతుంది అని గుర్తించాలి.
అలాగే శరీరంలో బరువు పెరుగుతున్న కొద్దీ రక్తంలో కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతూ ఉంటుంది. దానివల్ల హైపర్ టెన్షన్, డయాబెటిస్, మన శరీరాన్ని ఎటాక్ చేసే ప్రమాదం ఎక్కువ. ఈ రెండు కారణాల వల్ల రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి. ఎప్పటికప్పుడు మీ బరువును అదుపులో ఉంచుకోవడమే దీనికి పరిష్కారం. ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ ఉంటే మాత్రం వెంటనే దాన్ని కరిగించాలి. లేకపోతే చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.