Tamannaah: ఫిజిక్‌పై కాన్సట్రేషన్ చేస్తున్న మిల్కీ బ్యూటీ.. మరింత వెయిట్ తగ్గేసిందటగా
Tamannaah: నటి తమన్నా భాటియా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌కు ఆమె వ్యక్తిగత బ్రేకప్ ఒక విధంగా ‘వరంగా’ మారిందనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. నటుడు విజయ్ వర్మతో రెండేళ్ల పాటు కొనసాగిన ప్రేమాయణం ఇటీవల ముగిసిన తర్వాత ఆమె తిరిగి తన కెరీర్‌పై, ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
ప్రేమ వ్యవహారంలో ఉన్నప్పుడు కాస్త ఫిట్నెస్ను నిర్లక్ష్యం చేయడం వల్ల తమన్నా బరువు పెరిగారనే అభిప్రాయం ఉంది. అయితే విజయ్ వర్మతో బ్రేకప్ జరిగిన వెంటనే తమన్నా తన ఫిజిక్‌పై కాన్సంట్రేషన్ పెట్టి, గతంలో ఎన్నడూ లేనంత స్లిమ్‌గా తయారయ్యారు. అంతేకాకుండా, ఈ మధ్య కాలంలో ఆమె వరుసగా కొత్త ప్రాజెక్టులకు సంతకం చేస్తూ దూసుకుపోతున్నారు.
తమన్నా సన్నబడటంపై అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ, సినీ పరిశ్రమలో కొందరు ఆమె ఫిట్నెస్ మార్పుపై పుకార్లు సృష్టించారు. మిల్కీ బ్యూటీ బరువు తగ్గడానికి మెడిసిన్స్ లేదా వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకున్నారనే వార్తలు వ్యాప్తి చెందాయి.
తాజాగా, ఒక ఇంటర్వ్యూలో తమన్నాకు ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఎటువంటి దాపరికం లేకుండా స్పష్టత ఇచ్చారు. “నేను 15 ఏళ్లుగా కెమెరా ముందు నటిస్తూనే ఉన్నాను, నా జీవితంలో ఎక్కువ భాగం ప్రేక్షకులకు తెలుసు. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అప్పుడెలా ఉన్నానో, ఇప్పుడు అలానే ఉన్నాను. సాధారణంగా ప్రతి మహిళలో ఐదేళ్లకొకసారి శారీరక మార్పులు సహజం” అని తమన్నా వివరించారు. కోవిడ్ సమయంలోనే శారీరకంగా కాస్త దెబ్బతిన్నానని, ఆ తర్వాత బరువు తగ్గడం కోసం కష్టపడ్డానని ఆమె తెలిపారు.
ప్రస్తుతం తమన్నా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. స్పెషల్ సాంగ్స్‌తో పాటు, ఫీమేల్ లీడ్ పాత్రల్లోనూ నటిస్తున్నారు. హిందీలో ‘ఓ రోమియా’, ‘రేంజర్’, ‘వివాన్’, ‘రాగిణీ ఎంఎంఎస్ 3’ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా, తమిళంలో విశాల్- సుందర్ సి కాంబోలో సినిమా చేయబోతున్నారు. తెలుగులో ‘ఓదెల 2’ తర్వాత ఆమె మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ‘శంకర్ వర ప్రసాద్ గారూ’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే బజ్ నడుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ హీరోయిన్గా నటించిన అనుబంధంతో, ఇప్పుడు చిరంజీవి సినిమాలోని ప్రత్యేక పాట కోసం అనిల్ రవిపూడి తమన్నాను సంప్రదించినట్లు టాక్.
