Taraka Ratna Death Reason : తారకరత్న మరణానికి అసలు కారణం అదేనా…??
వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అభిమానుల ప్రార్ధనలు ఫలించలేదు…చివరికి నందమూరి కుటుంబంలో విషాదమే మిగిలింది…
నందమూరి తారకరత్న గారు గత నెల 27న లోకేష్ పాదయాత్ర లో తీవ్ర గుండెపోటు వచ్చి.. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి నిన్న బెంగళూరు లోని ప్రముఖ గుండె సంభంధిత ఆసుపత్రి నారాయణ హృదయాలయ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
అయితే తారక్ మరణానికి అసలు కారణం వేరే ఉందని.. ఆయన గుండెపోటుకి గురై కుప్పకూలిన సమయంలో మెదడుకి దాదాపు 45 నిమిషాలు పాటు రక్తప్రసరణ నిలిచిపోయిందని వైద్యులు గుర్తించారు.
దాంతో కొంతభాగం మెదడు దెబ్బతిందని.. అందులో నీరు కూడా చేరినట్లు తెలిపారు. అయితే ఆ తరువాత చికిత్స లో భాగంగా గుండె, కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ… మెదడు దెబ్బతినడంతో కోలుకోలేకపోయారు.. చివరికి నిపుణులు అయిన విదేశీ వైద్యులని బెంగళూరు రప్పించి చాలారోజులు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగించినప్పటికీ ఫలితం దక్కలేదు..