తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో సమావేశం జరిగింది. గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని అందుకున్నందుకే మెగాస్టార్‌ను గారిని అభినందించడానికే సమావేశమయ్యారని గంటా అనుచరులు చెబుతున్నారు.
అయితే ఈ మీటింగ్ కి ముఖ్య ఎజెండా మాత్రం తాజా రాజకీయ అంశాలు అన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే పవన్‌కు సపోర్ట్‌గా చిరంజీవి మాట్లాడారు. అవసరమైతే తాను కూడా పవన్‌కు మద్దతుగా నిలబడతానన్నారు.
ఆ మాటలు మరువక ముందే చిరంజీవి, గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చిరంజీవి వెనక ఉండి సపోర్ట్ చేస్తాను అన్నారు కాబట్టి ఆ పని తెలుగుదేశం ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేసి మొదలెట్టారు అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మామూలుగా అయితే ఈ మీటింగ్ కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదు గాని గంట శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని పెడతారని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆయన జనసేన చేరడానికి సుముఖంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి స్పందన లేదని నెట్ ఇంట కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనితో గంటా చిరంజీవి వైపు నుంచి విషయాన్ని నరుక్కుని వస్తున్నారు అని టాక్..!!