Teenmar Mallanna:తీన్మార్ మల్లన్నకి 14 రోజులు రిమాండ్…ఇది కేసీయార్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అన్న రేవంత్ రెడ్డి
హత్యాయత్నం కేసుకు సంభందించి తెలంగాణా క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కి కోర్ట్ 14 రోజులు రిమాండ్ విధించింది.దీనితో ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకి పంపించారు.మల్లన్న పై సాయికిరణ్ అనే వ్యక్తి తనపై హత్యాయత్నం చేశాడు చేశాడంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఈ కేసుకి సంభందించి గతరాత్రి క్యూ న్యూస్ ఆఫీస్ లో పోలీసులు సోదాలు జరిపారు.అనంతరం పోలీసులు మల్లన్నని అదుపులోకి తీసుకొని మేజిష్ట్రెట్ ముందు హాజరుపరిచారు.
అయితే ఈ వ్యవహారంపై తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నిరంకుశ పాలన పట్ల ప్రజలని చైతన్యం చేస్తున్నందుకే మల్లన్నపై ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తుందని విమర్శించారు. ఈ వ్యవహారంలో మల్లన్న ప్రాణాలకి ఎలాంటి ఆపద వచ్చినా దానికి కేసీయార్ ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు.మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.